Header Banner

క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.! తెలుసుకోకపోతే మీకే నష్టం..

  Sat May 31, 2025 12:54        Business

కొత్త నెల జూన్ 2025 ప్రారంభమవుతోంది. ఇది కేవలం కేలెండర్‌లో మార్పు మాత్రమే కాదు. ఇది మన ఆర్థిక జీవితాలపై ప్రభావం చూపించే కీలక మార్పులకు సమయం కూడా. ఈ క్రమంలో జూన్ 1 నుంచి (New Rules from June 1st) మ్యూచువల్ ఫండ్లు, క్రెడిట్ కార్డులు, పీఎఫ్ నిబంధనలు, వడ్డీ రేట్లు, ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ సహా అనేకం మారనున్నాయి. ఈ మార్పుల గురించి తెలుసుకోకుంటే మీరే నష్టపోయే అవకాశం ఉంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ఆధార్ అప్‌డేట్ గడువు..

myAadhaar పోర్టల్ ద్వారా ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి చివరి తేది జూన్ 14గా ఉంది. ఆన్ లైన్‎లో జూన్ 14 తర్వాత రూ. 25 ఛార్జ్ చేస్తారు. ఆధార్ సెంటర్‌లో అప్‌డేట్ చేసేందుకు జూన్ 14 తర్వాత రూ. 50 వసూలు చేస్తారు. మీ ఆధార్ వివరాలు ఇంకా మార్చుకోకుంటే ఇప్పుడే మార్చుకోండి మరి.

 

HDFC Bank (జూన్ 10 నుంచి)

Tata Neu Infinity & Plus కార్డులకు లౌంజ్ యాక్సెస్ ఇప్పుడు స్పెండ్ ఆధారంగా వోచర్ల రూపంలో లభిస్తుంది. మునుపటి విధానం ప్రకారం స్వైప్ ద్వారా లభించే లాంజ్ యాక్సెస్ ఇకపై ఉండదు.

 

ఐటీఆర్ గడువు..

మీరు కంపెనీ ద్వారా ఫామ్ 16 పొందడానికి చివరి తేది జూన్ 15. ఇది ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేయడంలో చాలా కీలకం కానుంది. మీరు ఉద్యోగి అయితే తప్పక ఈ డాక్యుమెంట్‌ను పొందాల్సి ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: అలెర్ట్.. ఏపీలో మెగా డీఎస్సీ.. పరీక్షల షెడ్యూల్‌ ఇదే.!

 

కొత్త కట్ ఆఫ్ టైం..

SEBI (Securities and Exchange Board of India) ఓవర్‌నైట్ మ్యూచువల్ ఫండ్స్‌కి జూన్ 1 నుంచి కొత్త కట్ ఆఫ్ సమయాలను ప్రకటించింది. ఆఫ్‌లైన్ లావాదేవీలకు మధ్యాహ్నం 3 గంటలు, ఆన్‌లైన్ లావాదేవీలకు సాయంత్రం 7 గంటలుగా తెలిపింది. ఈ సమయాల తర్వాత చేసిన లావాదేవీలు తదుపరి రోజున మాత్రమే ప్రాసెస్ అవుతాయి. దీంతో మీ ఇన్వెస్ట్‌మెంట్‌కి వర్తించబోయే NAV (Net asset value) మారుతుంది. ఓవర్‌నైట్ ఫండ్లు చాలా తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి ఎంపిక కాగా, వీటిలో ఒక్క రోజు వ్యవధి గల ప్రభుత్వ బాండ్లు కూడా ఉంటాయి. ఈ మార్పులు ఫండ్ కార్యకలాపాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి నిర్ణయించారు.

 

సిలిండర్ ధరల్లో మార్పు..

ప్రతి నెలా మొదటి తేదీన ఆయిల్ కంపెనీలు LPG గ్యాస్ ధరలను మార్చుతుంటాయి. మే నెలలో ధర తగ్గిన నేపథ్యంలో, జూన్ 1న మరో సవరణ వచ్చే ఛాన్సుంది. ఇది గృహ వినియోగదారుల బడ్జెట్‌పై ప్రభావం చూపనుంది.

 

క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు..

Kotak Mahindra Bank, HDFC Bank, Axis Bank వంటి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.

 

Kotak Mahindra Bank (జూన్ 1 నుంచి)..

రివార్డ్ పాయింట్లపై పరిమితి (On fuel, rent, bills, insurance), నెలవారీ ఫ్యూయెల్ ఖర్చు ఒక స్థాయి దాటితే 1% ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తారు. రెంట్ & ఎడ్యుకేషన్ ఖర్చులపై ఎలాంటి పరిమితి లేకుండా 1% ఫీజు వసూలు చేస్తారు. వాలెట్ లోడ్, ఆన్‌లైన్ గేమింగ్‌పై అదనపు చార్జీలు ఉంటాయి.


Axis Bank (జూన్ 20 నుంచి)..

Axis REWARDS క్రెడిట్ కార్డ్‌కి క్రమంగా మార్పులు రానున్నాయి. క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్, ఇతర ఖర్చుల కేటగిరీలు అన్నీ దీనిలో భాగమవుతాయి.

 

పీఎఫ్ మరింత సులభం..

Employees Provident Fund Organisation (EPFO) జూన్ నెలలో EPFO 3.0 సిస్టమ్‌ను ప్రారంభించబోతుంది. ఈ క్రమంలో మీరు విత్ డ్రా చేయాలనుకున్న మొత్తాన్ని ATM లేదా UPI ద్వారా తక్షణం విత్ డ్రా చేసుకోవచ్చు. UPI యాప్‌ల ద్వారా బాలెన్స్ చెక్ చేసుకోవడం, క్లెయిమ్ ప్రాసెసింగ్, గ్రీవెన్స్ పరిష్కారం వంటి సేవలను ఈజీగా పొందవచ్చు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

 

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Business #NewRules #June1St #ChangesInCreditCards #PFAndMore